NTR Maharshi

Thursday, 26 February 2015

మార్చి 5న ‘సూర్య వర్సెస్ సూర్య’.. 

సూర్యుడి కాంతిని తట్టుకోలేని పార్ఫీనియా అనే అరుదైన వ్యాధితో బాధపడే కుర్రాడి పాత్రలో యువ హీరో నిఖిల్ నటిస్తున్న సినిమా ‘సూర్య వర్సెస్ సూర్య’. నేటితో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్ పెద్దమ్మ తల్లి గుడిలో చివరి రోజు షూటింగ్ జరిపారు. మీడియా సమక్షంలో జరిగిన ఈ షూటింగులో గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్చి 5న సినిమాను విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. నిఖిల్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 700 వందల థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నాం’ అని నిర్మాత చెప్పారు.
ఆసక్తికరమైన కథను వినోదాత్మకంగా కమర్షియల్ ఫార్మటులో తెరకెక్కించాం అని దర్శకనిర్మాతలు తెలిపారు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో త్రిధా చౌదరి హీరోయిన్. బేబీ త్రిష సమర్పణలో సురక్షా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ కుమార్ నిర్మిస్తున్నారు. మధుబాల, తనికెళ్ళ భరణి, సత్య కీలక పాత్రలలో నటించారు. ‘కార్తికేయ’ దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాకు డైలాగ్స్ అందించడం విశేషం.