NTR Maharshi

Tuesday, 14 July 2015

RudramaDevi Movie with 20Crores loss of Profit.,

బాహుబ‌లి కోసం రాజ‌మౌళి ఎన్ని క‌ల‌లు క‌న్నాడో… రుద్ర‌మ‌దేవి కోసం గుణ‌శేఖ‌ర్ కూడా అన్నే క‌ల‌లు క‌న్నాడు. బాహుబ‌లి – రుద్ర‌మ‌దేవి… రెండూ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాలే. అయితే… బాహుబ‌లికి వ‌చ్చిన క్రేజ్‌లో ప‌ది శాతం కూడా రుద్ర‌మ‌దేవికి రాలేదు. రాజ‌మౌళి త‌న మాస్ట‌ర్ ప్లాన్‌తో ఈ సినిమాకి పైసా ఖ‌ర్చు పెట్ట‌కుండా బీభ‌త్స‌మైన ప‌బ్లిసిటీ చేసి – విప‌రీత‌మూన హైప్ క్రియేట్ చేయ‌గ‌లిగాడు. అయితే గుణ‌శేఖ‌ర్ మాత్రం ఈ విష‌యంలో క్రియేటీవ్ గా ఆలోచించ‌లేక‌పోయాడు.
రుద్ర‌మ‌దేవి తొలి ట్రైల‌ర్ కూడా ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. దాంతో రుద్ర‌మ‌దేవి వైపు బ‌య్య‌ర్లు తొంగి చూడ‌లేదు. బాహుబ‌లి కంటే ముందే రుద్ర‌మ‌దేవిని విడుద‌ల చేయాల‌నుకొన్నాడు గుణ‌. కానీ.. అదీ సాధ్యం కాలేదు. ఇప్ప‌డు బాహుబ‌లి వ‌చ్చేసింది. రుద్ర‌మ‌దేవికి విముక్తి క‌ల‌గ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం. అందుకే ఆగ‌మేఘాల‌మీద రుద్ర‌మ‌దేవిని బ‌య‌ట‌కు తీసుకొద్దామ‌నుకొంటున్నాడు గుణ. ఈ సినిమాకి ఇప్ప‌టి వ‌ర‌కూ రూ.65 కోట్ల బ‌డ్జెట్ అయ్యింద‌ని టాక్‌. ఏ సినిమా అయినా నిర్మాత టేబుల్ ప్రాఫిట్‌తో అమ్ముకోవాల‌ని చూస్తాడు. కానీ ఈ సినిమా మాత్రం గుణ‌శేఖ‌ర్ క‌నీసం రూ.20 కోట్ల డేబుల్ లాస్‌తో రిలీజ్ చేస్తున్నాడ‌ట‌.