NTR Maharshi

Tuesday, 14 July 2015

Satellite Rights of Bahubali {*Record}

ప్రపంచ వ్యాప్తంగా జూలై 10న ఘనంగా విడుదలైన ‘బాహుబలి’ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ ముందుకుసాగుతోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఇప్పటివరకూ ఏ చానెల్ కి అమ్మలేదు. నిర్మాతలకు, ఓ ప్రముఖ చానల్ కి మధ్య జరిగిన బేరసారాలు సఫలం కాకపోవడంతో విడుదలకు ముందు ఈ సినిమా శాటిలైట్ హక్కులను అమ్మలేదట నిర్మాతలు. తాజాగా సినిమా విడుదలైన తర్వాత, రెండు పెద్ద చానల్స్ శాటిలైట్ హక్కుల కోసం నిర్మాతలతో చర్చలు జరిపాయి.
15కోట్లు శాటిలైట్ హక్కుల నిమిత్తం పే చేయడానికి రెండు ప్రముఖ చానల్స్ సిద్ధమయ్యాయి. అయితే 18కోట్లు కావాలని నిర్మాతలు అడిగారట. ఫైనల్ గా 16కోట్లుకు జీ తెలుగు చానల్ ‘బాహుబలి’ శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. హిందీ వెర్షన్ ధియేట్రికల్ రైట్స్ ని కరణ్ జోహార్ తీసుకున్న విషయం తెలిసిందే. హిందీ వెర్షన్ శాటిలైట్ హక్కులను సోనీ పిక్స్ వారు 17కోట్లుకు దక్కించుకున్నారు.
తెలుగు సినిమా శాటిలైట్ రైట్స్ ఇంత రేటుకి అమ్ముడు పోవడం ఇదే ప్రధమం అయితే… ఓ తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ కి 17కోట్లు శాటిలైట్ హక్కులు పలకడం కూడా ‘బాహుబలి’కే సాధ్యమయ్యింది. కోలీవుడ్ లో కూడా శాటిలైట్ హక్కుల కోసం చర్చలు జరుగుతున్నాయట. సో… శాటిలైట్ పరంగా మరో కొత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది ‘బాహుబలి’.