NTR Maharshi

Sunday, 5 July 2015

బాలయ్య శ్రీ కృష్ణ దేవరాయులుకు రాజమౌళికి గ్రీన్ సిగ్నల్

అప్పట్లో ఆదిత్య 369 లో శ్రీ కృష్ణ దేవరాయులుగా అలరించిన బాలయ్య , తర్వాత ఎన్నో పౌరాణిక, జానపద పాత్రలు చేసి అందరి మన్ననలు అందుకున్నాడు. ఇటివలే వచ్చిన శ్రీ రామ రాజ్యం లో రామునిగా కూడా మెప్పించిన బాలయ్య , మళ్ళీ శ్రీ కృష్ణ దేవరాయులుగా కనిపించనున్నారు .
ఈ విషయం రాజమౌళి నోరు జారి చెప్పడంతో అందరికి తెల్సిపోయింది.మొదటగా శ్రీ కృష్ణ దేవరాయులు చరిత్ర మీద సినిమా తీద్దాం అని రాజమౌళి అనుకున్నడంట. కానీ అదే సమయానికి ఆయన గురువు రాఘవేంద్ర రావు బాలయ్య మీద శ్రీ కృష్ణ దేవరాయుల కథ ఒకటి అనుకున్నడని  తెల్సింది . రాఘవేంద్ర రావుకి ఈ ఆలోచన ఎప్పటి నుండో ఉందట , నీకు కుదిరితే నువ్ చేసెయ్యి అని రాజమౌళికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడంట. గురువు గారు అనుకున్నారు కదా అని రాజమౌళి అ కథని వొద్దని నిశ్చయించుకొని బాహుబలి కథ కి బీజాలు వేసాడు . ఏది ఏమైనా బాలయ్య అని మళ్ళి శ్రీ కృష్ణ దేవరాయులుగా చూసే అవకాశం ముందు ముందు ఉందని రాజమౌళి చెప్పకనే చెప్పాడు .