NTR Maharshi

Wednesday, 29 July 2015

మహేష్ బాబు శ్రిమంతుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీస్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నది. జగపతి బాబు తండ్రిగా నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీమంతుడు పాటలు సూపర్ హిట్. కాబట్టి సినిమా కూడా అంతే భారీ విజయం సాధిస్తుందన్న ముందస్తు అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికైతే మహేష్ తన పార్ట్ కి డబ్బింగ్ చెప్పడం అయిపొయింది.
ఇటు తెలుగు,అటు తమిళ్ రెండు చోట్ల అనువాదం పూర్తి చేశారు. ఆగస్టు 7 న తెలుగు,తమిళ్ భాషల్లో విడుదల కానున్నది. అలాగే హిందీ, మలయాళంలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా భారీ పబ్లిసిటీ చేస్తున్నారు. శ్రీమంతుడు టీజర్ పాటలకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగినట్లు అనిపిస్తుంది. మహేష్ మరోసారి జాక్ పాత కొట్టేట్లు కనిపిస్తున్నాడు. అసలే భారీ కాస్టింగ్ తో సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ని రంగుల మయంగా ఉంటుంది కాబట్టి కచ్చితంగా మేజిక్ సాధ్యమే అని అనిపిస్తుంది.