NTR Maharshi

Tuesday, 11 August 2015

20 Cr. Loss to Srimanthudu..?

శ్రీమంతుడు సినిమా విడుదలై మంచి విజయం సాధించడంతో మహేష్ బాబు, అతని అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ నిర్మాతలు కాస్త బెంగ పెట్టుకున్నారు. తొందరపడ్డామని బాధపడుతున్నారట. అందుకు కారణం ఏమిటంటే….ఈ సినిమాకి ఇప్పుడు పాజిటివ్ బజ్ వచ్చి మంచి వసూల్లని రాబడుతున్నది. కానీ విడుదలకు ముందు ఇంత హైప్ లేదు.
టీం కూడా శ్రీమంతుడు ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని అనుకోలేదు. అందుకే రాత్రికి రాత్రే ఈ సినిమాని యూరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి హోల్ సెల్ ఆ 80 కోట్లకు అమ్మేశారు. ఇప్పుడు ఈ సినిమా వందకోట్ల దిశగా దూసుకుపోతుంది, కనీసం ఈ సినిమా వంద కోట్లు రాబట్టినా 20 కోట్లు శ్రీమంతుడు నష్టపోయినట్లే కదా…! వన్ నేనొక్కడినే సినిమాని కొని తీవ్రంగా నష్టపోయిన యూరోస్ సంస్థ వాళ్ళు ఈ సినిమాతో గట్టెక్కినట్లే.
శ్రీ‌మంతుడుకి ఓవ‌రాల్‌గా రూ.120 కోట్లు రావ‌చ్చ‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల అభిప్రాయం. రూ.80 కోట్లు దాటి ఎంతొచ్చినా యూరోస్ క‌ళ్ల‌లో వెలుగులు చూసే అవ‌కాశం ఉంది. రికార్డులు కొల్ల‌గొడుతున్న కొద్దీ… శ్రీ‌మంతుడు నిర్మాత‌ల మొహాలు బోసిబోతుంటాయి. ఎందుకంటే… ఆ వ‌సూళ్లంతా త‌మ ఖాతాలోకి రావాలి క‌దా. అందుకే. ఈ సినిమా హిట్ట‌యినా వాళ్ల‌కు మాత్రం సంపూర్ణ ఆనందం ద‌క్క‌డం లేదు.