NTR Maharshi

Monday, 31 August 2015

Sardar Gabbar Singh Box Office Verdict: Hit / Flop..?

సెంటిమెంట్ సెంటిమెంట్ సెంటిమెంట్ …. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సెంటిమెంట్స్ గురించి మీరు విని వుంటారు. ఒక సినిమా లో హీరోయిన్ దగ్గర నుండి సహాయ నటుడి పాత్ర వరకు కొంత మంది సెంటిమెంట్స్ ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే , ఇప్పుడు ఇటువంటి సెంటిమెంట్ , సర్దార్ గబ్బర్ సింగ్ కి కూడా పట్టుకుంది.
తెలుగు సినిమాల్లో సీక్వెల్ గా వచ్చిన సినిమాలన్నీ పరాజయాలు గానే మిగిలిపోయాయి. ఆర్య – ఆర్య 2, శంకర్ దాదా ఎం బి బి ఎస్ – శంకర్ దాదా జిందాబాద్, రక్త చరిత్ర – రక్త చరిత్ర 2, గాయం – గాయం 2 , చంద్రముఖి – నాగవల్లి , యమలీల – యమ లీల 2 ఇక తాజాగా కిక్ – కిక్ 2.
అస్సలు సిక్వేల్స్ ఎందుకు ఫ్లాప్ అవుతాయ్ అనేది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఒక సినిమా పెద్ద హిట్ అయినప్పుడు , ఆ సినిమాకి సీక్వెల్ అనగానే భారి అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలను సినిమా అందుకోనపుడే ఇలాగ ఫ్లాప్ అవుతాయి అంటున్నారు జనాలు. కిక్ 2 విషయంలో కూడా అదే జరిగింది.
సర్దార్ గబ్బర్ సింగ్ కూడా అంచనాలను అందుకోకపోతే పరాజయం తప్పదు అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయాన్నీ పసిగట్టిన పవన్ కళ్యాణ్, సర్దార్ గబ్బర్ సింగ్ మీద చాల శ్రద్ధ చుపుతున్నాడట. పైగా గబ్బర్ సింగ్ కి గబ్బర్ సింగ్ సీక్వెల్ కి దర్శకులు వేరు కాబట్టి అంచనాలు కొంత వరకు ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి అంశాలన్నీ సర్దార్ గబ్బరి సింగ్ యూనిట్ ని కలవార పెడుతున్నాయి.
ఐన పవర్ స్టార్ పవర్ ముందు ఈ సెంటిమెంట్స్ ఏ మాత్రం. తన సినీ ప్రస్తానం ప్రారంభంలోనే వరుసగా 7 హిట్ మూవీస్ ని ఇచ్చి, 3 ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పవన్ కి ఈ సెంటిమెంట్ లు పనిచెయ్యవు అని పవన్ అభిమానులు ధీమా ఉన్నారు. పవర్ స్టార్ ట్రెండ్ ఫాలో అవ్వడు. సెట్ చేస్తాడు అని అంటున్నారు అభిమానులు.