NTR Maharshi

Monday, 14 September 2015

Prabhas has been signed as the national brand ambassador of Mahindra TUV 300 and here is one of the print ads. He looks dashing as ever.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలుగులో టాప్ స్టార్స్‌లో ఒకరు. ఇప్పటివరకూ తెలుగులోనే పాపులర్ అయిన ఈ స్టార్, ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయారు. ఒక తెలుగు సినిమా బాలీవుడ్‌లో సృష్టించిన సంచలనంతో బాహుబలి స్టార్ ప్రభాస్ అంటూ కొత్త బిరుదుతో ప్రపంచానికి పరిచయమయ్యారు ప్రభాస్. ఈ సినిమా ఆయనకు దేశవ్యాప్తంగా తెచ్చిన క్రేజ్‌తోనే మహీంద్ర సంస్థ తమ కొత్త వాహనం టీయూవీ 300కు ప్రభాస్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. మహీంద్రాతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న ప్రభాస్, టీయూవీ 300 కోసం ఒక యాడ్ షూట్‌లోనూ పాల్గొన్నారు. త్వరలోనే ఈ యాడ్ విడుదలకు సిద్ధమవుతోండి. ఇక మహీంద్రా సంస్థ నిన్న ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన టీయూవీ 300 లాంచ్ వద్ద ప్రభాస్ స్టాండీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘టచ్ టు ది కోర్’ అన్న ట్యాగ్‌లైన్‌తో ఆరడుగులకు పైనే పొడవుండే ప్రభాస్ పోస్టర్ నిన్న జరిగిన లాంచ్ ఈవెంట్‌కు మేజర్ హైలైట్‌గా కనిపించింది.